Skip to main content

Posts

Showing posts from June, 2022

మీరు టాక్స్ పరిధిలో ఉన్నారా.. అయితే ఫారం-16 గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Income Tax Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. ప్రస్తుతానికి జూలై 31 వరకు ఫైలింగ్ కు అనుమతి ఉంది. మరోవైపు అన్ని కంపెనీలు కూడా జూన్- 15 వరకు తమ ఉద్యోగులకు ఐటీఆర్ ఫారం-16 జారీ చేశాయి. దీని సహాయంతో ఉద్యోగులందరూ తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. చాలా కాలంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వారికి ఫారం-16 గురించి బాగా తెలుసే ఉంటుంది. కానీ.. ఇటీవల ఉద్యోగం ప్రారంభించిన వారు లేదా ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చిన వారు ఫారం-16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. దానిలో ఎలాంటి వివరాలు అందించాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.. అసలు ఈ ఫారం- 16 అంటే ఏమిటి..? కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేస్తాయి. ఇది ఉద్యోగి జీతంపై మినహాయించబడిన పన్నుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు.. ఉద్యోగి HRA లేదా అన్ని రకాల ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసినట్లయితే.. ఆ సమాచారం కూడా ఫారం-16లో ఇవ్వటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫారం-16 అనేది ఉద్యోగి జీతంపై పన్ను లెక్కింపు సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ను కంపెనీలు ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాయి. ఫారం...