LIC వంటి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే కాకుండా ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల (తమ కస్టమర్స్) వద్ద నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో డబ్బులు సేకరించి ఆ డబ్బును డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. తమ వద్దనున్న నగదును మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఫండ్ మేనేజర్లు ఉంటారు. వీరికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి లక్షలాది రూపాయలు వేతనం చెల్లిస్తారు. కొన్ని ఫండ్స్ మేనేజర్స్ సగటున 10 వేల కోట్ల ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు.
బ్యాంకులు ఎలాగైతే ప్రజల వద్ద నుండి సేకరించిన డిపాజిట్ డబ్బులను ఇతరులకు రుణాలు ఇవ్వడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని పొంది, ఆ వడ్డీలో కొంత మొత్తం డిపాజిట్ దార్లకు చెల్లిస్తాయో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రజలు (కస్టమర్స్) కట్టిన ప్రీమియంల డబ్బులను ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించి, అందులో తమ నిర్వహణ ఖర్చులు, ప్రాఫిట్ మార్జిన్ పోను మిగిలిన మొత్తాన్ని తమ కస్టమర్స్ కి చెల్లిస్తాయి.
LIC మునిగి పోతుందా ?
LIC మొత్తం assets సుమారు గా 42 లక్షల కోట్లు . అందులో ఈక్విటీ లో invest చేసింది 10.27 లక్షల కోట్లు . 2022 financial year లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సంపాదించిన లాభం 44000 కోట్లు . Adani group లో సుమారు 7 శాతం , అంటే 77 వేల కోట్లు invest చేసింది . అంటే adani shares సగానికి సగం పడిపోయినా కేవలం ఒక్క సంవత్సరం లో వచ్చిన లాభం కంటే తక్కువ . LIC మొత్తం డబ్బులు ఈక్విటీ లో పెట్టదు . కాబట్టి LIC మునిగి పోవడం అనే ప్రశ్న లేదు .
Adani total gas అనే కంపెనీ మొత్తం share capital 109 కోట్లు . మొత్తం assets 4415 కోట్లు .
ఒక్కొక్క share పై సంవత్సరానికి వచ్చే ఆదాయం ( EPS) 4.61 రూపాయలు . అంటే 3000 పైబడి కొన్న share సంవత్సరానికి 4.61 రూపాయలు సంపాదిస్తుంది . (అది డైరెక్ట్ గా బ్యాంక్ లో వేసుకున్నా 210 రూపాయలు వస్తాయి ) . ఈ share market capitalisation 324000 కోట్లు . అంటే 109 కోట్లతో పెట్టిన కంపెనీ విలువ పెద్దగా ఆదాయం లేకపోయినా మూడు లక్షల కోట్లు అయ్యిందన్నమాట. అదీ ఎంతో పడిపోయిన తర్వాత ! అంటే కేవలం 109 కోట్లు పెట్టుబడి పెట్టి 324000 కోట్ల company గా inflate చేశారు . పోనీ ఎంతో లాభాలు వస్తాయా అంటే కేవలం 4.6 EPS . మహా ఉంటే share ధర 46 నుంచి 100 రూపాయలు మించకూడదు . పోనీ గొప్ప growth ఉంటుంది అనుకున్నా 300-500 మించకూడదు . ఈ share 4000 వరకూ వెళ్లింది . ఇదంతా ఎందుకు రాశానంటే మన LIC గారు దీనిలో సెప్టెంబర్ 22 వరకూ invest చేస్తూ పోయారు . అంటే 3000 పైన కూడా కొన్నారన్న మాట . ఫైనాన్స్ మీద కనీస అవగాహన ఉన్న వాళ్లకి కూడా ఈ valuation బోగస్ అని తెలుస్తుంది . మరి ప్రసిద్ధి గాంచిన LIC ఫండ్ managers దీనిలో ఎందుకు పెట్టుబడి పెట్టారు ?
ఈ share లో 75 శాతం promoters కే ఉంది . మామూలు ఇన్వెస్టర్స్ వాటా అతి స్వల్పం . నాకు తెలిసి PSU ల exposure కూడా మునిగిపోయే అంతగా లేదు .
ఫ్లోటింగ్ shares యొక్క విలువని పెంచడానికి LIC ఉపయోగపడిందా ? దీనివల్ల లాభపడింది ఎవరు ? చివరిలో 3000 పైన కొన్న చిన్న ఇన్వెస్టర్స్ మాత్రం తప్పకుండా నష్టపోతారు . బహుశా ఈ share 500 స్థాయికి పడిపోవచ్చు . అది కూడా దీనికి ఎక్కువే.ADANI TOTAL GAS SHARE
SBI , LIC లు మునిగిపోవు ..కానీ లాభాల్లో కోత ఉంటుంది . అది కేవలం తెలిసీ , ఎవరి ప్రయోజనాల కోసమో Mismanage చేయడం వల్ల మాత్రమే .


Comments
Post a Comment