పాపం ఆ పేద వైద్య విద్యార్థిని మెడికల్ కాలేజీలో జేరడానికి అక్షరాలా ఒక కోటీ పదమూడు లక్షల డబ్బై వేల ఐదు వందల రూపాయలు అవసరం అయ్యింది...
దానికి మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు...ఎంతో వ్యయ ప్రయాసలు పడి సమకూర్చాడు...
అంతేనా...ఇలాగే మరెంతో మంది...పట్టణ మధ్యతరగతి మరియు పేద వర్గాల సేవల కోసం బోల్డంత డబ్బు అవసరం అవుతూ ఉంటుంది...
ఈ అవసరాలు తీర్చడానికి...మూల వాసీ బచావో మంచ్... మావోకు బోల్డన్ని మారు పేర్లు లెండి...ఆ పేర్లతో బ్యాంకుల్లో శ్రమలకోర్చి జమలు చెయ్యాలి...
పెట్టుబడి దారి దేశాలు ఎలా డబ్బు సంపాదిస్తాయి తెలుసుకోవడానికి...అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి పేద ప్రజలు స్థిర పడాల్సి ఉంది...
అలాగే అసలు ఈ క్యాపటలిస్టులు డొల్ల కంపెనీలు నిర్వహించి ఎలా డబ్బు కొట్టేస్తారో కూడా అధ్యయనం చెయ్యాల్సి ఉంది...
పెద్ద మొత్తం నగదును...బంగారంగా మార్చి...నల్ల ధనాన్ని ఎలా సమకూరుస్తారు కూడా గట్టిగా తెలుసుకోవాలి...
ఈ రాజ్యం సృష్టించిన దుర్మార్గమైన ఈడి... సిబిఐ వంటి సంస్థలకు వాళ్ళ స్థానం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది...
వీటన్నిటినీ సాధించాలంటే...ఈ దుర్మార్గ...అర్థ భూస్వామ్య...పావు ప్రజాస్వామ్య ...మనువాద ప్రజలున్న ప్రదేశానికి దూరంగా తుపాకుల పహారాలో అడవుల్లో ప్రయోగ శాలలు నిర్వహించాలి...
ఈ రాజ్యాంగం ఒట్టి బూటకం అని నిరూపించాలంటే...ఈ వ్యవస్థల డొల్లతనం బయట పెట్టాలంటే ఎంతటి త్యాగాలు చెయ్యవలసి ఉంటుంది...
ఆ నగదు త్యాగాలకు ...ఆ బంగారపు వ్యధలకు ఆసరాగా నిలవాలంటే ఎంత ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలుసా...
ఎంత పెద్ద నెట్వర్క్ కావాలి...
ఒకరా ఇద్దరా...వందల మంది నిరంతరం విప్లవాత్మకంగా పని చెయ్యాలి...ఎన్ని సంస్థలు స్థాపించాలి...
పౌరహక్కుల సంఘాలు....పీపుల్స్ లిబరేషన్ ఫ్రంటులు...బచావో సమితిలు... రాడికల్ విద్యార్థి సంస్థలు...
ఎన్ని రాజకీయ సంస్థల్లో దూరాలి...
ఎన్ని యుట్యూబ్ ఛానెల్స్ పెట్టాలి...ఎందరు కథకులు..కవి పండితులను...వ్యాసకర్తలను.. ఎడిటర్లను మేపాలి...
డబ్బు పంపకాలలో...క్షమించాలి...లావాదేవీల్లో తేడా వస్తే...
ఏయే వార్తా పత్రికలలో...అవతలి వాళ్ళ బంగారం...సారీ బండారం ఎలా బయట పెట్టాలి...
400 కిలోలో...1400 కిలోలో... ఏ విప్లవ ప్రతీఘాత శక్తి ఎంత డబ్బు ఏ బ్యాంకులో డిపాజిట్ చేసిందో...అందులో శర్మో... రెడ్డీ నో ఉంటే...ఎలా వ్రాయచ్చో...
ప్రభుత్వం ఇచ్చే పాతిక ముప్ఫై లచ్చలకు..బొచ్చు ఏం వస్తుందని... అంతంత డంపులు వదిలేసి...నవ్వులు చిందిస్తూ లొంగుతారు ఎవరైనా...
అలా లొంగడానికి ముందు...ఎంత విప్లవాత్మక గణాంకాలు అప్పజెప్పాలి...ఎవరి వాటా ఎంతో సరిగ్గా తేలకపోతే...సంపద సమాన పంపిణీ అన్న మార్క్స్ మావోల సూత్రాలకు విరుద్ధం కాదూ...
కొన్ని కష్టాలు పగ వాళ్ళకి కూడా రావద్దు దేముడా...
రిచ్ లో రిచ్ గా ఉండి కూడా...భుజాన తుండు గుడ్డ వేసుకుని...గజ్జెలు కట్టి పేదరికపు ఏడుపులు ఏడుస్తూ చిందులు వెయ్యాలంటే ఎంత కష్టం...
మూల వాసులు...ఆదివాసులు ఆ డంపుల్లో ఏముందో తెలియకుండానే కాపలా కాస్తూ...రాజ్యపు నీచపు తుపాకీ కి రాలిపోతుంటే..పంటి బిగువున దుఃఖం అదిమిపట్టి... పత్రికలకు "అభయం" ఇస్తూ లేఖలు వ్రాయడం ఎంత కష్టం...
ఏమో...మన లాంటి మనువాదులకు...ఈ లెక్కలు అర్థం కావాలంటే..ఇంకో జన్మ ఎత్తాలి...
ఈలోగా మా(వో) ఇళ్ళు బంగారం కానూ...మా ఒళ్ళు సింగారం కానూ...జోరు మీద ఉన్నాము... జుర్రు కుందామా...మురిపాల డంపులన్నీ దోచుకుందామా...
అంటూ పేరడీ పాడుకుందాము...అంత కంటే ఏం చెయ్యగలం అంధ భక్తులం!!!!
అమ్మలూ అక్కలూ...అంత బంగారం చూసి లబ లబ లాడకండి...దగ్గర్లో ప్రగతి శీల మహిళా సంఘం శీలవతిని సంప్రదించండి...ఏమైనా సమాచారం దొరకచ్చు...
వాళ్ళ వెంబడి తిరగ మాకండే...ఈ రాజ్యపు పోలీసులు తిరగమోత పెట్టెయ్యచ్చు...
కొన్ని చూసి ఆనందించాలంతే 😎
పసిడి విప్లవం వర్ధిల్లాలి...!!!
Comments
Post a Comment