నష్టాలను బూచిగా చూపిస్తూ దేశంలో ప్రభుత్వ రంగం విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్
1990-91 నుండి 2023-24 సంవత్సరాల మధ్యలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన మొత్తం నష్టం విలువ రూ 21,847 కోట్లు కాగా, రూ 13,966 కోట్లు లాభం కూడా ఆర్జించింది. అంటే ఈ 33 ఏళ్ల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన మొత్తం నికర నష్టం రూ 7,881 కోట్లు.
ఐతే అప్పటికీ ఇప్పటికీ విలువ 20 రెట్లు పెరిగి రూ 3.70 లక్షల కోట్లకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం మార్కెట్ విలువను పట్టించు కోకుండా కేవలం నష్టాన్ని మాత్రం భూతద్దంలో చూపిస్తూ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును ప్రేవేటు చేతుల్లో అర్జెంటుగా పెట్టేయాలని తహతహలాడటం ఏవిధంగా సమర్ధనీయం.
"విశాఖపట్నం స్టీల్ ప్లాంట్" ను ప్రైవేటు పరం
చెయ్యెద్దు. ప్రతి కర్మాగారంలో ఎదురయ్యే సమస్యలనే ఇక్కడ మాత్రం భూతద్దంలో చూపిస్తూ,ప్లాంట్ సమస్యలకు పరిష్కార మార్గాలున్నా వాటిని పట్టించుకోకుండా
పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లకు నష్టం వస్తే చాలు దాన్ని ప్రైవేటు పరం చేసేస్తే అన్నీ సరైపోతాయనే ఆలోచనా ధోరణి తీవ్ర
తప్పిదంగా పరిగణించాలి.విశాఖ ఉక్కును
గాడిలో పెట్టడం ముమ్మాటికీ సాధ్యమే.👇
మన దేశంలో :
➡️ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు
రూ 5.07 లక్షల కోట్ల రూపాయల ఋణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి
➡️ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగం లోని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నమోదు చేసిన మొత్తం నష్టం విలువ రూ 2.9 లక్షల కోట్లు..
దేశంలో ప్రస్తుతం ఆపరేషన్ లో ఉన్న మొత్తం 272 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లలో నష్టాలు వస్తున్నది 58 సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లలో మాత్రమే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐఎన్ఎల్) కూడా వాటిలో ఒకటి.
1990-91 నుండి 2023-24 సంవత్సరాల మధ్యలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన మొత్తం నష్టం విలువ రూ 21,847 కోట్లు కాగా, రూ 13,966 కోట్లు లాభం కూడా ఆర్జించింది. అంటే ఈ 33 ఏళ్ల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన మొత్తం నికర నష్టం రూ 7,881 కోట్లు.
మొత్తం దేశంలోని
సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లన్నీ కలిసి గత పదేళ్లలో రూ 2.9 లక్షల కోట్ల నష్టాన్ని మూట కట్టుకోగా, గత 33 ఏళ్లలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చిన మొత్తం నికర నష్టం రూ 7,881 కోట్లు. ఈ వివరాలు క్రింది పట్టికలో చూడొచ్చు
ఐతే అప్పటికీ ఇప్పటికీ విలువ 20 రెట్లు పెరిగి రూ 3.70 లక్షల కోట్లకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం మార్కెట్ విలువను పట్టించు కోకుండా కేవలం నష్టాన్ని మాత్రం భూతద్దంలో చూపిస్తూ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును ప్రేవేటు చేతుల్లో అర్జెంటుగా పెట్టేయాలని తహతహలాడటం ఏవిధంగా సమర్ధనీయం.
అంచెలంచెలుగా విస్తరిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుత స్థితికి చేరడానికి మూడున్నర దశాబ్దాల కాలం పట్టింది. దేశంలో 20 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వరకు పెంచుకునేందుకు అనువుగా సకల సదుపాయాలతో సముద్ర తీరంలో ప్రభుత్వ రంగం ఏర్పరచుకున్న ఏకైక
కంపెనీ విశాఖపట్నం..
స్టీల్ ప్లాంట్. ఇలాంటి అద్భుతమైన భారీ ప్రభుత్వ రంగ కర్మాగారాన్ని అసలెందుకు ప్రైవేటు పరం చేయాలి?!
స్టీల్ ప్లాంట్. ఇలాంటి అద్భుతమైన భారీ ప్రభుత్వ రంగ కర్మాగారాన్ని అసలెందుకు ప్రైవేటు పరం చేయాలి?!
నష్టాన్ని బూచిగా చూపి ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేస్తే, నష్టాలను లాభాలుగా మార్చే మేజిక్కులు ప్రైవేటు యాజమాన్యం దగ్గర ఉండవని ఎందుకు ఆలోచించరు. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ రంగంలోని అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న యూనిట్ల కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. కొంతమంది విశాఖ ఉక్కులో అవినీతి వేళ్ళూనుకు పోయిందని అనడం కూడా సరైనది కాదు. అవినీతి అనేది దేశ వ్యాప్తంగా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నట్టు గానే ఇక్కడ కూడా ఉండొచ్చు నేమో గాక.కాని ఇక్కడే మాౠప్రత్యేకం అని చెప్పలేం. కేంద్రంలో శ్రీ #narendramodi ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో,సంస్థల్లో, యూనిట్లలో అవినీతి ప్రక్షాళన కోసం సిస్టమాటిక్ మార్పులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం.కేంద్ర స్ధాయిలో అవినీతి రహిత పాలన కోసం చిత్తశుద్ధితో కూడిన కృషి జరుగుతోంది. ఐతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం నుండి సరైన ప్రయత్నం జరగ లేదన్నది మాత్రం వాస్తవం. ఉదాహరణకు టాటా స్టీల్ సంస్థ ఉత్పత్తి చేసే "హై స్ట్రెంగ్త్ డీఫార్మ్డ్ బార్స్"(ఐయస్ : 1786-2008)
(వీటినే టీఎంటీ బార్స్ లేదా రీ బార్స్ అని కూడా అంటారు), "స్ట్రక్చరల్ స్టీల్" (ఐయస్ : 2062-2011) తో ధీటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తయారైన "హై స్ట్రెంగ్త్ డీఫార్మ్డ్ బార్స్" మరియు "స్ట్రక్చరల్ స్టీల్" సెక్షన్ల క్వాలిటీ ఉంటుందనేది వాస్తవం. కాని ఈ ఇరు కంపెనీలలో ఉత్పత్తి అయ్యే స్టీల్ ప్రోడక్ట్ లను మార్కెట్లో విక్రయిస్తున్న రేట్లలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఒక టన్నుకు టాటా స్టీల్ ప్రోడక్ట్స్ మార్కెట్లో అమ్ముతున్న రేటు కంటే విశాఖ స్టీల్ ప్రోడక్ట్స్ 10 వేల రూపాయల తక్కువ ధరకు ఎందుకు అమ్ము తున్నట్టు?!
మార్కెట్లో తిరుగులేని అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి అవుతున్న విశాఖ స్టీల్ ప్రోడక్ట్స్ విక్రయంలో ఇలాంటి దుస్థితి ఎందుకు నెలకొంది.ఇవి చూస్తుంటే మార్కెటింగ్ లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ లో దృష్టి సారించి మార్కెట్లో ప్రోడక్ట్స్ కు తగిన రేట్లు పొందగలిగితే ప్లాంట్ నష్టాలు రెండేళ్లలో మాయ మౌతాయి.
అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ కు అద్భుతమైన మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు ఉన్నాయి. ఖచ్చితమైన ఇండియన్ మరియు విదేశీ ప్రయాణాలను పాటిస్తూ ఉత్పత్తి చేస్తున్న టాప్ క్వాలిటీ ప్రోడక్ట్ రేంజ్ ఉంది. అన్నీ ఉన్నా తరచు ప్లాంట్ నష్టాల బారిన పడటానికిముఖ్య కారణం సొంత ఇనుప ఖనిజ గనులు లేక పోవడం అన్నది జగమెరిగిన సత్యం. సర్వసత్తాక అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం తన పాలసీకి పదును పెట్టి తన సొంత ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు సమకూర్చితే కేవలం రెండేళ్లలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పడుతుంది
ఆ తర్వాత ఆర్ఐఎన్ఎల్ తన ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్లాంటుకు కావలసిన నిధులను లాభసాటి రీతిలో తనకు తానే సులభంగా సమకూర్చుకోవచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేలా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఆయన మాట్లాడిన మాటలు అత్యంత గర్హనీయం. విశాఖ స్టీల్ ప్లాంట్
ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులు ఉన్నప్పుడు ప్లాంట్ ఉద్యోగులు 14,433 మంది కాగా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.3 టన్నులకు చేరిన తర్వాత ఇప్పుడు ప్లాంట్ లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 10,267 మంది మాత్రమే. అంటే ప్లాంట్ లో ఉద్యోగులు ఎంత పని ఒత్తిడిలో ఉన్నారో అన్నదానికి ఇంత కంటే వివరణ అవసరం లేదనుకుంటా. అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడే నైతిక అర్హత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటారా?
ప్లాంట్ లాభ నష్టాలు ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ తో పాటు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పై ఆధారపడి ఉంటాయి.
ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ప్లాంట్ కంట్రోల్ లో ఉంటుంది కాని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కంపెనీ కంట్రోల్ లో ఉండదు. ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో తరచు ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక నష్టాలొచ్చిన ప్లాంట్లను ప్రభుత్వం ప్రైవేటు కు అమ్మేద్దామనుకోవడం ఏమాత్రం సమర్ధనీయం కాదన పైన చెప్పినట్టు గత పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చేసిన రూ 5.07 లక్షల కోట్ల ఋణ మాఫీలు ఎవరివి ?! ఈ రూ 5.07 లక్షల కోట్లు కాకుండా మరో రూ 7.02 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్పిఏ (నాన్ ప్రొవిజినల్ అస్సెట్స్) గా డిక్లేర్ చేసాయి. అంటే మొత్తం రూ 12.09 లక్షల కోట్లన్న మాట. ఇలాంటి నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన మొత్తం నికర నష్టాలు ప్లాంట్ విస్తృతిని బట్టి చూస్తే నామ మాత్రమే అని చెప్పొచ్చు.
తుఫాన్లు వచ్చి తమ పంటలు నాశనం అవుతాయని ఏ రైతన్నా పొలంలో పంట పండించడం మానెస్తాడా. పంట దిగుబడి లాభసాటిగా లేదని రైతు సేద్యం చేయడం మానేస్తే తిండి గింజలు దొరుకుతాయా.నేటి విశాఖ స్టీల్ ప్లాంట్ కు భవిష్యత్తులో సెయిల్ కంపెనీ వలే లాభాలు చేకూరుతాయని ఎందుకు అనుకోకూడదు
2001 సంవత్సరంలో సెయిల్ కంపెనీ పరిస్థితిని పైన వివరించాను. దాని ఇప్పటి ఉఛ్ఛ పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు లోని "సాలెం స్టీల్ ప్లాంట్" ను, కర్ణాటక లోని "విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్" ను, ఛత్తీస్ గడ్ లోని"నాగర్నార్ స్టీల్ ప్లాంట్" ను, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్ లోని "ఎలోయ్ స్టీల్స్ ప్లాంట్" ను ప్రైవేటు పరం చేద్దామని 2017-2021 సంవత్సరాల్లో తీవ్రంగా ప్రయత్నించి ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అలా ఆ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం విరమించుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ "విశాఖపట్నం స్టీల్ ప్లాంట్" ను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్రం లోని శ్రీ #narendramodi గారి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కంటే ఎక్కువగా ఉవ్విళ్లూరుతున్నా రాష్ట్ర ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని "విశాఖపట్నం స్టీల్ ప్లాంట్" ను కేంద్ర ప్రభుత్వ రంగం నుండి దూరం చేయదని బలంగా నమ్ముతున్నారు.🙏
Comments
Post a Comment