LIC వంటి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే కాకుండా ప్రైవేటు రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల (తమ కస్టమర్స్) వద్ద నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో డబ్బులు సేకరించి ఆ డబ్బును డెట్ మరియు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. తమ వద్దనున్న నగదును మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఫండ్ మేనేజర్లు ఉంటారు. వీరికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి లక్షలాది రూపాయలు వేతనం చెల్లిస్తారు. కొన్ని ఫండ్స్ మేనేజర్స్ సగటున 10 వేల కోట్ల ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. బ్యాంకులు ఎలాగైతే ప్రజల వద్ద నుండి సేకరించిన డిపాజిట్ డబ్బులను ఇతరులకు రుణాలు ఇవ్వడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని పొంది, ఆ వడ్డీలో కొంత మొత్తం డిపాజిట్ దార్లకు చెల్లిస్తాయో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రజలు (కస్టమర్స్) కట్టిన ప్రీమియంల డబ్బులను ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించి, అందులో తమ నిర్వహణ ఖర్చులు, ప్రాఫిట్ మార్జిన్ పోను మిగిలిన మొత్తాన్ని తమ కస్టమర్స్ కి చెల్లిస్తాయి. LIC మునిగి పోతుందా ? LIC మొత్తం assets సుమారు గా 42 లక్షల కోట్లు . అందులో ఈక్విటీ లో invest చేసింది 10.27 లక్షల కోట్లు . 202...
We seeks higher interests in financial services, taxation, GST, I-T, etc. Writes articles with depth knowledge and is extensive for the same, Writing from observations and researching makes our articles virtuous.